
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మత వేడుక ‘దశలక్షణ మహాపర్వ’ ఈవెంట్‌లో రూ.1.5 కోట్ల విలువైన బంగారు కలశాలు, ఇతర వస్తువులు దొంగిలించిన భూషణ్ వర్మను పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌లో అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 3న ఈ దొంగతనం జరిగింది.
దర్యాప్తులో పోలీసులు ఎర్రకోట ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లలో భూషణ్ వర్మ కలశాలను దొంగిలించడం కనిపించింది. దీంతో పోలీసులు అతన్ని ట్రాక్ చేశారు. వర్మ జైన సమాజానికి చెందినవాడు కాదు. అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. సీసీ కెమెరాలతో అతన్ని ట్రాక్‌చేసి హపూర్‌లో పట్టుకున్నారు.