గీతం డెవలపర్స్ నుంచి గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్‌

గీతం డెవలపర్స్ నుంచి గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్‌

హైదరాబాద్, వెలుగు: రియల్​ ఎస్టేట్​ సంస్థ గీతం డెవలపర్స్ కొల్లూరు సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో గోల్డెన్ కౌంటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎండీ పవన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో ఒక ఎకరా విస్తీర్ణంలో క్లబ్ హౌస్‌‌‌‌తో పాటు అన్ని రకాల ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 

నగరానికి చేరువలో ఉండటం, మెరుగైన కనెక్టివిటీ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నివాసానికి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గోల్డెన్ కౌంటీ బ్రోచర్‌‌‌‌ను గీతం డెవలపర్స్ ఎండీ కావలి పవన్ కుమార్ యాదవ్‌‌‌‌తో కలిసి నటుడు బ్రహ్మానందం విడుదల చేశారు.