ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దరఖాస్తుదారులకు గోల్డెన్ చాన్స్

ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ దరఖాస్తుదారులకు గోల్డెన్ చాన్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అప్లికేషన్ ఫీజుపై 25 శాతం రాయితీతో పాటు మే 1 నుంచి మరో మూడు నెలల పాటు గడువు పొడిగించినట్లు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.  పెండింగ్​లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోమవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.

ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ప్రత్యేక హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేయడంతో పాటు, ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్​పై అవగాహన కల్పించేలా ప్రత్యేక డ్రైవ్‌‌‌‌లు, ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ మేళాలు నిర్వహించాల‌‌‌‌న్నారు.