
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్‌సీఐ).. ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ హెచ్‌ఆర్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ హెచ్ఆర్ విధానాలకుగాను ఈఎస్‌సీఐకి ఈ గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ చేతుల మీదుగా ఈఎస్‌సీఐ డైరెక్టర్ రామేశ్వర్‌రావు అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతి ఏటా ఈ పురస్కారం అందజేస్తోంది. ఇప్పటివరకు ఈఎస్‌సీఐను ఏడు గొల్డెన్ పీకాక్ అవార్డులు వరించాయి.