రాజ్యాధికార పదవుల్లో గొల్ల, కురుమలకు తీవ్ర అన్యాయం

రాజ్యాధికార పదవుల్లో గొల్ల, కురుమలకు తీవ్ర అన్యాయం
  •     యాదవ – కురుమ సంఘాల రాజ్యాధికార ఐక్యవేదిక

ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం గొల్ల, కురుమలకు రాజ్యాధికార పదవులు ఇవ్వాలని యాదవ-– కురుమ సంఘాల రాజ్యాధికార ఐక్యవేదిక డిమాండ్​చేసింది. వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘మేమెంతో.. మాకు అంత’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక చైర్మన్​మేకల కృష్ణ, ప్రొఫెస్​ర్లు సింహాద్రి యాదవ్, రాములు యాదవ్, బీఆర్ఎస్​లీడర్​క్యామ మల్లేశ్,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీ లీడర్​కాశం వెంకటేశ్వర్లు, మేకల రాములు యాదవ్​పాల్గొని మాట్లాడారు. 

జనాభా ప్రకారం యాదవ, కురుమ సామాజిక వర్గాలకు 3 మంత్రి పదవులు, 6 ఎమ్మెల్సీ, 2 ఎంపీ సీట్లు,13 కార్పొరేషన్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం గొల్ల, కురుమలపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. 14 శాతంగా ఉన్నవారికి పదవుల్లో అన్యాయం చేస్తోందన్నారు. మంత్రి వర్గంలో యాదవులకు చోటు లేదని, ప్రభుత్వంలోని పదవులన్నీ రెండు సామాజిక వర్గాలకే కట్టబెడుతున్నారని చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్పారు.