ఆలేరులో హ్యాట్రిక్ కొడుతం : గొంగిడి సునీత

ఆలేరులో హ్యాట్రిక్ కొడుతం : గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు:  ఆలేరుతో పాటు రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్‌‌ఎస్‌  ఆలేరు క్యాండిడేట్ గొంగిడి సునీత ధీమా వ్యక్తం చేశారు.  శుక్రవారం యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెం, వంగపల్లి, రామాజీపేట, చిన్నకందుకూరు, పెద్దకందుకూరు, మహబూబ్ పేట, చొల్లేరు, బాహుపేట, తాళ్లగూడెం, అహ్మద్ నగర్, మర్రిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 60 ఏండ్లలో సాధ్యంకాని అభివృద్ధిని సీఎం కేసీఆర్ పదేళ్లలో చేసి చూపించారన్నారు.

ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదని,  దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  రాష్ట్రంలో 100 స్థానాల్లో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.