ఎమోషనల్ డ్రామాగా 'గుడ్‌బై' ట్రైలర్

 ఎమోషనల్ డ్రామాగా 'గుడ్‌బై' ట్రైలర్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా  'గుడ్‌బై' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో ఆమె కలిసి నటిస్తోన్న  ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్  రిలీజ్ చేశారు, పుట్టిన రోజులు ఎన్నో ఉంటాయి కానీ చావు ఒక్కసారే వస్తుంది. ఏ మనిషి పోయినా అంత్యక్రియలను వేడుకగా జరిపించాలని చెప్పే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

ఇందులో అమితాబ్, రష్మిక తండ్రికూతుళ్లుగా నటిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలనుకునే కూతురిగా రష్మిక, అలా చేస్తే తనని అవమానించినట్టేనని ఫీలయ్యే పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. ఎమోషన్ తో పాటుగా మంచి కామెడీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నీనా గుప్త, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ కీరోల్ పోషిస్తున్నారు. 

వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రాన్ని  ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. 2022 అక్టోబర్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సినిమా పైన మంచి అంచనాలున్నాయి.