సౌందర్యానికి హనీ ప్యాక్

సౌందర్యానికి హనీ ప్యాక్

తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం నిమ్మరసంతో కలిపి తేనె తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పాలలో కూడా తేనె కలిపి తీసుకోవచ్చు. గ్రీన్‌‌‌‌ టీలోనూ యాడ్‌‌ చేసుకుని తాగొచ్చు. ఆయుర్వేద మందుల తయారీలో కూడా తేనెను చాలా ఎక్కువగా వాడుతారు. అయితే ఆహారంగా తీసుకుంటేనే కాదు.. తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనెలో ఉన్న సుగుణాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. తేనెతో ఫేస్‌‌ప్యాక్‌‌ చేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు తగ్గిపోతాయని హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. మొటిమలు, నల్లటి మచ్చలు, గోధుమ మచ్చలు, ముడతలు ఉన్న చర్మంపై తేనెను ప్యాక్‌‌లా చేసుకోవడం వల్ల అవి తొలగిపోతాయి. హనీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌‌, యాంటీ సెప్టిక్, యాంటీ ఏజింగ్‌‌ లక్షణాలు దెబ్బతిన్న చర్మ కణాలను తొలగించి, కొత్త కణాలు పుట్టడంతో సహాయపడుతుంది. తేనె ఫేస్‌‌ మాస్క్‌‌ వేసుకోవాలంటే అవకాడో లేదా అరటి పండు గుజ్జును యాడ్‌‌ చేయాలి. ఈ రెండింటిని క్రీమ్‌‌లా చేసి, ఫేస్‌‌పై మాస్క్‌‌లా వేసుకోవాలి. రోజూ ఇలా ఫేస్‌‌ప్యాక్‌‌ చేసుకుంటూ ఉంటే ముడతలు పోవడంతోపాటు, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.