Good News : పేదల సొంతింటికి రూపం: ఇందిరమ్మ ఇల్లు నమూనా సిద్ధం.. ఇల్లు ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి..

Good News : పేదల సొంతింటికి రూపం: ఇందిరమ్మ ఇల్లు నమూనా సిద్ధం.. ఇల్లు ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి..

నల్గొండ: పేదల సొంతింటి కలకు అడుగులు పడుతున్నాయి. జనవరి 26, 2025 నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్​ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం చేపడుతున్నారు.

నల్గొండ జిల్లాలో ఈ ఇందిరమ్మ నమూన ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ ఇందిరమ్మ నమూన ఇల్లు పేదల సొంతింటి కలను సాకారం చేసే విధంగా ఉండటం విశేషం. ఇందిరమ్మ ఇంటిని 45 గజాల్లో నిర్మించేలా డిజైన్​ చేశారు. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ ​విత్​ అటాచ్​ బాత్రూమ్, ఒక హాల్, కిచెన్​ ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్​ చేశారు.

ఇంటికి రెండు వైపులా రెండు దర్వాజాలు, వెంటిలేషన్  ఎక్కువగా రావడానికి హాల్​లో రెండు కిటికీలు, కిచెన్​లో ఒకటి, బెడ్రూమ్​లో ఒక కిటికీని అమర్చారు. కిచెన్లో సింక్​ విత్​ పైప్​లైన్​ ఏర్పాటు చేశారు. వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్​ ట్యాంక్ను ఏర్పాటు చేయగా.. దాని ద్వారా కిచెన్, బాత్రూమ్​కు కనెక్షన్​ ఇచ్చారు. ఇదే తరహాలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. 45 గజాలకు కాకుండా 70 గజాల నుంచి 75 గజాల స్థలం ఉంటే లబ్ధిదారులు కాంపౌండ్​ వాల్​ నిర్మించుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేదని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్​నగర్​ నిమోజకవర్గంలోని మహబూబ్​నగర్​ రూరల్​ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల వీరయ్య తన సొంత జాగలో ఇంటిని నిర్మించుకున్నాడు. దీనిని డెమోగా చూయిస్తూ.. ఈ నిర్మాణం ప్రకారం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. ఇలా తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం దాదాపు పూర్తయింది.