యాపిల్ స్మార్ట్​ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

యాపిల్ స్మార్ట్​ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

యాపిల్ స్మార్ట్​ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ వాడేవాళ్లకు గుడ్​న్యూస్. అదేంటంటే...  యూజర్ల కంఫర్ట్ కోసం ఈ ఏడాది ఐదు కొత్త సాఫ్ట్​వేర్​ అప్​డేట్స్​ తెస్తోంది యాపిల్. ఈమధ్య జరిగిన ‘వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్’​లో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సాఫ్ట్​వేర్ల ద్వారా యాపిల్ డివైజ్​ల పనితీరు మరింత మెరుగుపడుతుంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్.  

అన్​సెండ్ మెసేజెస్  

ఐఒఎస్ 16 ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా చివరగా పంపిన మెసేజ్​లని ఎడిట్ చేసి, ఐమెసేజ్​లని పంపొచ్చు. యాపిల్ మెసేజ్ యాప్​ని ఉపయోగించేవాళ్లు అవతలివాళ్లకు పంపిన మెసేజ్​ని అన్​సెండ్ చేయొచ్చు కూడా. యూజర్లు ఒక మెసేజ్​ని ఎడిట్ చేయడానికి, అన్​సెండ్ చేయడానికి 15 నిమిషాల టైం ఉంటుంది. అయితే, ఈ ఫీచర్​  మెసేజ్ యాప్ వాడే యూజర్లకు మాత్రమేనా? ఆండ్రాయిడ్ యూజర్లకు  కూడా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. 

కొత్త లాక్​ స్క్రీన్

నోటిఫికేషన్లు చెక్ చేసుకోవడానికి చాలాసార్లు ఫోన్ లాక్​స్క్రీన్​ని అన్​లాక్ చేస్తుంటాం. అయితే, ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్​ యూజర్లకు కస్టమైజ్​డ్ లాక్​స్ర్కీన్ ఉంటుంది. కానీ, ఐ ఫోన్ యూజర్లకు కస్టమైజ్​డ్ లాక్​స్క్రీన్  ఉండదు. ఇకమీదట  ఐ ఫోన్​ వాడేవాళ్లు  వాతావరణం, అలారం, యాక్టివిటీస్​ నోటిఫికేషన్ల కోసం హోమ్ స్క్రీన్ మీద చిన్న విడ్జెట్స్​ పెట్టుకోవచ్చు. అచ్చం యాపిల్ వాచ్​లో మాదిరిగానే ఆప్షన్ల మీద గట్టిగా నొక్కి పట్టి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అంతేకాదు కస్టమ్​ లాక్​స్ర్కీన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 

ఐఫోన్ వెబ్​కామ్

మ్యాక్ వెబ్​కామ్​గా చాలామంది ఐఫోన్ కెమెరా వాడుతుంటారు. అయితే, ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఐఒఎస్ 16, మ్యాక్ఒఎస్ వెంచురా అప్​డేట్ల సాయంతో ఐఫోన్​ని మ్యాక్​ వెబ్​కామ్​గా మార్చేయొచ్చు. దీన్ని ‘కంటిన్యుటీ కెమెరా’ అంటారు. ఐఫోన్​ని దగ్గరకు తీసుకురాగానే కెమెరా ఆటోమెటిక్​గా మ్యాక్​కి కనెక్ట్ అవుతుంది. ఫోన్​ని అన్​లాక్ చేయాల్సిన పనిలేదు. ఫేస్​టైమ్, జూమ్, వెబ్​మ్యాక్స్, ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​లకు కంటిన్యుటీ  కెమెరా బాగా పనికొస్తుంది. 

ఐపాడ్ ఒఎస్

ఐఒఎస్16 అప్​డేట్​తో ఐపాడ్ దాదాపు మ్యాక్​లా పనిచేస్తుంది. ‘కొలాబరేషన్’ అనే ఫీచర్ ద్వారా ఐపాడ్ ముందు కూర్చొని ఆఫీస్​లోని కొలీగ్స్​, ఫ్రెండ్స్​తో మాట్లాడడం చాలా ఈజీ.  అంతేకాదు ‘ఫ్రీ ఫామ్’ అనే యాప్​  సాయంతో వర్చువల్​గా ఇంటరాక్ట్ కావొచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది.  

మెడికేషన్ ట్రాకింగ్

యాపిల్ వాచ్ ద్వారా మెడికేషన్ ట్రాకింగ్ చేయడం ఈజీ కానుంది. అందుకోసం వాచ్ ఒఎస్9 లో ‘మెడికేషన్ యాప్’ ఉంటుంది. ఏ మందులు వేసుకుంటున్నారు? ఏ మందులు  ఎప్పుడు వేసుకోవాలి? అనేది చెప్తుంది. అందుకోసం మెడిసిన్ వివరాలు, అవి తీసుకునే టైంని యాప్​లో ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ మందుల వల్ల  ఇబ్బంది అనిపిస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది ఈ యాప్.

స్నాప్​చాట్​లో పెయిడ్ సబ్​స్క్రిప్షన్​​

కంటెంట్ క్రియేటర్స్​కి డబ్బులు రావడం కోసం పెయిడ్ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొస్తున్నాయి సోషల్​మీడియా యాప్స్.  ఇన్​స్టాగ్రామ్ ఇప్పటికే ఈ ఫీచర్​ తెచ్చింది. స్నాప్​చాట్ కూడా త్వరలోనే పెయిడ్ సబ్​స్క్రిప్షన్​ ఫీచర్ తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్ పేరు ‘స్నాప్​చాట్ ప్లస్’. ఈ ఫీచర్​తో యూజర్లకు లాభమేమిటంటే... బెస్ట్​ ఫ్రెండ్స్​ని పిన్ చేయొచ్చు. స్నాప్​చాట్ ఐకాన్​ని మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్​ ఏం చేస్తున్నారు?  స్టోరీలను మళ్లీ ఎంతమంది చూశారు? అనేవి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు గేమ్స్ ఆడొచ్చు. టిక్​టాక్​ లాగా ఉండే స్పాట్​లైట్ ఫీచర్​ని వాడొచ్చు.  ప్రస్తుతం  టెస్టింగ్ స్టేజ్​లో ఉన్న ఈ ఫీచర్​ సబ్​స్క్రిప్షన్​ ధర నెలకు 380 రూపాయలు. ఏడాదికి 3,740 రూపాయలు. 

పిక్చర్- ఇన్- పిక్చర్

గూగుల్ మీట్​లో త్వరలోనే కొత్త ఫీచర్ రాబోతోంది. పేరు ‘పిక్చర్ ఇన్ పిక్చర్’. ఇందులో  మీట్ వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్ మీద చిన్న విండో కనిపిస్తుంది. అందు​లో  కొలీగ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​​తో ఇంటరాక్ట్ కావొచ్చు. ఈ ఫీచర్ ఉంటే వీడియో కాల్ మాట్లాడుతూనే డాక్యుమెంట్లు, వెబ్​పేజీలను కూడా చూడొచ్చు. 

ఎలా ఆన్​ చేయాలంటే...

వెబ్​లో గూగుల్ మీట్ కాల్ వచ్చినప్పుడు  మెను బటన్​పై క్లిక్ చేయాలి. ఓపెన్ పిక్చర్–ఇన్– పిక్చర్ ఆప్షన్​ని సెలక్ట్ చేయాలి. దాంతో స్క్రీన్ మీద కుడివైపు చిన్న విండో ఓపెన్ అవుతుంది. అంతేకాదు మీట్ కాల్​లో ఉన్నప్పుడు మ్యూట్, డిజేబుల్ వీడియో, ఎండ్ ది కాల్, గో బ్యాక్ టు ఫుల్​ స్క్రీన్ మోడ్​ వంటి ఆప్షన్లని వాడుకోవచ్చు.