
న్యూఢిల్లీ: ఈ వారం ఆరు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకురానున్నాయి. ఇందులో ఒక మెయిన్‌బోర్డ్, ఐదు ఎస్‌ఎంఈ ఐపీఓలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లకు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ సప్లయ్ చేసే అరిస్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, ఈ నెల 20న ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. 24 న ముగుస్తుంది. ఐపీఓ షేరు ధర రూ. 210–-222. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 499.6 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ.
ఎస్‌ఎంఈ ఐపీఓలు..
ఎస్‌ఎంఈ సెగ్మెంట్లో, పాటిల్ ఆటోమేషన్, సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్ ఐపీఓలు జూన్ 16న ఓపెన్ అయి, జూన్ 18న క్లోజ్ అవుతాయి. పూణేకి చెందిన పాటిల్ ఆటోమేషన్, వెల్డింగ్, లైన్ ఆటోమేషన్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 114–-120 ధరతో షేర్లను అమ్మనుంది. సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్, ఈపీసీ సర్వీసెస్ అందిస్తోంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 32–-34. ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్స్ తయారీ కంపెనీ ఎప్పెల్‌టోన్ ఇంజనీర్స్ తన ఐపీఓను జూన్ 17న ఓపెన్ చేస్తుంది.
ధర రూ. 125–-128. ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ తన రూ. 58.6 కోట్ల ఐపీఓను జూన్ 18న ఓపెన్ చేస్తుంది. ఐపీఓ ధర రూ. 91–-96. ఈ పబ్లిక్ ఇష్యూ జూన్ 20న క్లోజ్ అవుతుంది. మాయశీల్ వెంచర్స్ జూన్ 20న ఓపెన్ అవుతుంది. ధర రూ. 44–-47. మరోవైపు ఓస్వాల్ పంప్స్ ఐపీఓ జూన్ 17 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఐపీఓలో షేరు ధర
రూ. 584–-614.