
తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమా అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. జయాపజయాలంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు విజయ్. అంతేకాదు.. నార్మల్ కమర్షియల్ సినిమాలు కాకుండా రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. తాజాగా మరోసారి అలాంటి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. అదే లవ్ గురు(Love Guru). భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది.
Also Read: మూడు కథలతో వచ్చిన శ్రీరంగనీతులు.. సుహాస్ మరో హిట్టు కొట్టాడా?
అయితే ఈ సినిమా మేకర్స్ ఆడియన్స్ కుక్ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అదేంటంటే.. లవ్ గురు సినిమా టికెట్స్ అతి తక్కువ ధరలకు అందించనున్నారు. అది కూడా కేవలం రూ.150 రూపాలకు మాత్రం. సింగల్ థియేటర్స్ లో మాత్రం కాదు.. మల్టిప్లెక్స్ లో సైతం అదే ధరకు లవ్ గురు టికెట్స్ ను అమ్మనున్నారు మేకర్స్. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటన చూసిన ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తక్కువ ధర కాబట్టి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని అనుకుంటున్నారు.
A perfect Summer entertainer is ready at ???/- in all multiplexes near you ❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) April 11, 2024
Book your tickets now!
?️ https://t.co/ZdTixXBQZE@vijayantony & team are back with another refreshing PERFECT FAMILY ENTERTAINER after the Bichagadu series ?#LoveGuru ????? ???????… pic.twitter.com/HntqwCNe2x
ఇక లవ్ గురు సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా అంతా భార్య భర్తల మధ్యే సాగే ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. పెళ్లంటే అంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన భార్య ప్రేమను ఎలా పొందుతాడు అనేది లవ్ గురు కథ. సినిమాలో విజయ్ ఆంటోనీ పాత్ర చాలా బాగా పండింది. మరీ ముఖ్యంగా ఆయనపై ఆయన వేసుకునే సెటైర్స్ ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్విస్తాయి. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి.. వీకెండ్ లో సరదాగా లవ్ గురు సినిమా చూసి నవ్వుకోవచ్చు.