Sriranga Neethulu Movie Review: మూడు కథలతో వచ్చిన శ్రీరంగనీతులు.. సుహాస్ మరో హిట్టు కొట్టాడా?

Sriranga Neethulu Movie Review: మూడు కథలతో వచ్చిన శ్రీరంగనీతులు.. సుహాస్ మరో హిట్టు కొట్టాడా?

టాలీవుడ్ టాలెంటెడ్ నటులు సుహాస్‌(Suhas), విరాజ్‌ అశ్విన్‌(Viraj Ashwin), కార్తీక్‌ రత్నం(Karthik Rathnam), రుహానీ శర్మ(Ruhani sharma) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శ్రీరంగనీతులు(Sriranga Neethulu). ఆంథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ తెరకెక్కించగా.. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Also Read: సినీ లవర్స్కి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే లవ్ గురు మూవీ టికెట్స్

కథ:
శ్రీరంగనీతులు కథ విషయానికి వస్తే.. శివ(సుహాస్) హైదరాబాద్ బస్తి కుర్రాడు. అదే బస్తీలో ఉన్న మిగతా కుర్రాళ్ళ కన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అలా ఆ ఏరియా నాయకుడితో ఫొటో దిగి బతుకమ్మ పండుగకు గల్లీలో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. 
కానీ, తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీని శివ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చించేస్తారు. రెండో కథలో  కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో ఫెయిల్ అయ్యాయని, అది తలుచుకుంటూ చేదు వ్యసనాలకు అలవాటు పడతాడు. ఆశ్రమంలో తన ఫ్లాట్ లోనే గంజాయి పెంచుతాడు. ఒకరోజు కార్తీక్ తమ్ముడు ఆ గంజాయి మొక్కలతో సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అది గమనించిన పోలీసులు కార్తీక్ కోసం వెళ్తారు.. అప్పటికే గంజాయి మొక్కలతో పారిపోతాడు కార్తీక్.

మరో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమలో ఉంటారు. ఒకానొక సమయంలో ఇందుకు తాను ప్రగ్నెంట్ అయ్యానేమో అని అనుమానం వస్తుంది. అదే సమయంలో ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం సెట్ చేస్తారు. అది తెలిసిన ఇందు తన విషయాన్నీ ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. మరి శివ ఫ్లెక్సీ గొడవ ఎక్కడివరకు వెళ్ళింది? వేయించాడా? గంజాయితో పారిపోయిన కార్తీక్ పోలీసులకు దొరికాడా? ఇందు తన ప్రేమ విషయం తన పేరెంట్స్ కి చెప్పిందా? అనేది శ్రీరంగనీతులు మిగతా కథ. 

విశ్లేషణ:
ఒక సినిమాలో ఒకటికి మించిన కథలు చెప్పడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. శ్రీరంగనీతులు కూడా ఆ కోవకు చెందినదే. మూడు డిఫరెంట్ కథలతో ముందుకు సాగే కథకి.. ఆంథాలజీ కాన్సెప్ట్ యాడ్ చేశారు దర్శకుడు. సినిమాలో మూడు కథలకీ ఎలాంటి సంబంధం ఉండదు. ఏ కథకి ఆ కథే ప్రత్యేకం. తెరపై ముందు కథలు ఒకేసారి కానిస్తున్నా.. స్క్రీన్ ప్లేలో చిన్న కన్ఫ్యూజన్ కూడా లేకుండా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు.

ఫ్యామిలీ, లవ్, లైఫ్, సెటిల్మెంట్, ఎమోషన్స్, వంటి సెన్సిటీవ్ విషయాల గురించి చాలా బాగా వివరించాడు దర్శకుడు. మనిషి తనకున్నదాంట్లో తృప్తి పడకుండా.. ఇంకా ఏదోకావాలనే కాన్సెప్ట్ ని చూపించడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. మూడు కథలు, వేరే వేరు మనుషులు, వేరు వేరు సమస్యలు, వేరే వేరు సందర్భాలు.. వాటితో చిన్న సందేశం. తాను అనుకున్న కథని ప్రేక్షకులకు చెప్పడంలో ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేశాడు దర్శకుడు ప్రవీణ్ కుమార్.

నటీనటులు: 
సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సహజమైన పాత్ర దొరికితే రెచ్చిపోయే సుహాస్ మరోసారి అలాంటి పాత్రలో మంచి నటనను కనబరిచాడు. హైదరాబాద్ బస్తి కుర్రాడి పాత్రలో నటించడం కాదు జీవించాడు. ఇక హీరోయిన్ రుహాణి శర్మ పాత్ర కూడా నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడే సాధారణ యువతీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక బేబీ సినిమా తరువాత లవర్ బాయ్ పాత్రలో మరోసారి మెప్పించాడు విరాజ్. లైఫ్ లో ఓడిపోయి వ్యసనాలకు బానిసైన యువకుడిగా కార్తీక్ రత్నం నటన కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక మిగిలినవారు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. 

సాంకేతికవర్గం:
 శ్రీరంగనీతులు సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. సన్నివేశాలకు తగ్గట్టుగా తన సహజమైన మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు అజయ్ అరసదా, హర్షవర్ధన్ రామేశ్వర్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మూడు కథలకు తగ్గట్టుగా విజువల్స్ ను చాలా చక్కగా సెట్ చేశారు.ఇక మూడు కథలను ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా నిజాయితీగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ప్రవీణ్ కుమార్.

ఇక మొత్తంగా చెప్పాలంటే.. జీవితాన్ని చెప్పే శ్రీరంగనీతులు.. ఒక మంచి ప్రయత్నం