ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

V6 Velugu Posted on Sep 17, 2020

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. 2020-21 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ లో 30 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై గురువారం రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. కరోనా క్రమంలో ఆన్ లైన్ క్లాసులు ఆలస్యంగా మొదలుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. CBSE ఏ సిలబస్ అయితే తగ్గించిందో తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా అదే సిలబస్ తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయని వారిని కూడా పాస్ చేస్తామని తెలిపారు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. దీంతో ఇంటర్ స్టూడెంట్స్ కు కరోనా పుణ్యమా అని డబుల్ ధమాకా వచ్చినట్లయ్యింది.

Tagged Inter Students, PASS, Intermediate syllabus

Latest Videos

Subscribe Now

More News