టమాట రేట్లపై కేంద్రం గుడ్ న్యూస్.. ఢిల్లీలో భారీగా సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన.. హైదరాబాద్లో పరిస్థితేంటి..?

టమాట రేట్లపై కేంద్రం గుడ్ న్యూస్.. ఢిల్లీలో భారీగా సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన.. హైదరాబాద్లో పరిస్థితేంటి..?

వర్షాకాలం వచ్చిందంటే చాలు టమాట రేట్లు అమాంతం పెరిగిపోతుంటాయి. వర్షాలకు తెగుళ్లు రావడం, పంట దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరుగుతుంటాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే పెరిగిన రేట్ల నుంచి ఊరట కలిగిస్తూ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టమాటలకు సబ్సిడీ ఇవ్వడంతో ప్రజలకు తక్కువ ధరలో లభ్యమయ్యేలా చూడనున్నట్లు ప్రకటించింది. 

దేశ రాజధాని ఢిల్లీ లో రిటైల్ ధరలను కేజీకి 47 నుంచి 60 రూపాయల మధ్య అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ (NCCF) ద్వారా సబ్సిడైజ్డ్ ధరలకే టమాట అందించనున్నట్లు ప్రకటించారు.  NCCF ఇప్పటి  వరకు 27 వేల 3 వందల కిలోల టమాట సబ్సిడీ ధరలకు అందించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

►ALSO READ | నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది..: బెంగళూరు లైఫ్ స్టయిల్ పై మహిళా టెక్కీ ఆవేదన..

ఆగస్టు 4 నుంచి అజాపూర్ మండి నుంచి మార్జిన్ ప్రైజ్ లో టమాటా కొనుగోలు చేస్తున్న NCCF .. ప్రజలకు 47 నంచి 60 రూపాయలకు అందించినట్లు పేర్కొంది. అయితే ఢిల్లీలో యావరేజ్ కిలో ధర 73 ఉంది. ఢిల్లీ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా పంటలు దారుణంగా దెబ్బతినటంతో దిగుబడి తగ్గిపోయింది. జులై చివరి వారంలో కిలో ధర రూ.85 కు చేరుకుంది. దీంతో టమాట రేట్లు దారుణంగా పెరిగాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర మంత్రిత్వ శాఖ NCCF  ద్వారా సబ్సిడీ కింద టమాటలు అమ్ముతున్నారు. 

హైదరాబాద్, ముంబైలో ధరలు ఎలా ఉన్నాయి?

శుక్రవారం (ఆగస్టు 08) ప్రకారం టమాట ధరలు ముంబైలో కేజీ 58 రూపాయలు ఉండగా.. చెన్నై లో కేజీ ధర 50 గా ఉంది. ఇక హైదరాబాద్ లో 34 నుంచి 40 రూపాయల దగ్గర ఉంది. దేశ వ్యాప్తంగా యావరేజ్ టమాట కిలో ధర 52 రూపాయలు ఉండగా.. గత ఏడాది 54 గా ఉంది. 2023 లో సరాసరి ధర 136 కు చేరి చుక్కలు చూపించింది. అయిత ఈ సారి టమాట ధరలు కంట్రోల్ లోనే ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.