పండంటి అడబిడ్డకు జన్మనిచ్చిన యువీ భార్య .. ఏం పేరు పెట్టారో తెలుసా?

పండంటి అడబిడ్డకు జన్మనిచ్చిన యువీ భార్య .. ఏం పేరు పెట్టారో తెలుసా?

టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్.. మరోసారి తండ్రయ్యారు. యువరాజ్ సతీమణి హేజెల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు.

చిన్నారికి ఆరా(Aura)గా నామకరణం చేశారు. బుజ్జాయి రాకతో తమ కుటుంబం సంపూర్ణమయ్యిందంటూ యువీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. "మా లిటిల్ ప్రిన్సెస్‌ ఆరాకు గ్రాండ్ వెలకమ్.. ఆమె రాకతో మా కుటుంబం సంపూర్ణం అయింది. నిద్రలేని రాత్రులు చాలా ఆనందకరంగా మారాయి.." అని యువీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

యువరాజ్.. నటి, మోడల్ అయిన హేజెల్ కీచ్‌ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరు 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ దంపతులకు 'ఓరియన్ కీచ్ సింగ్' అనే కుమారుడు ఉన్నారు. 2022 జనవరిలో ఈ బాబు జన్మించారు.