
జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు వచ్చాయి. రైల్వే అధికారుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో పొగలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే విద్యుత్ లైన్ నిలుపుదల చేస్తేనే పొగలను అదుపు చేసేందుకు సులభం అవుతుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దీంతో విద్యుత్ నిలిపివేయడంతో పలు పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.