గోదాట్లోకి దారి చూపిన గూగుల్ మ్యాప్ .. ప్రాజెక్టులో చిక్కుకున్న లారీ డ్రైవర్, క్లీనర్

గోదాట్లోకి దారి చూపిన గూగుల్ మ్యాప్ .. ప్రాజెక్టులో చిక్కుకున్న లారీ డ్రైవర్, క్లీనర్

గూగుల్ మ్యాప్స్ అంటే తెల్వని వాళ్లుండరు. కొత్తగా ఏదైనా ఊరికి వెళ్ళడానికి  వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తుంటారు. వెళ్లాల్సిన చోటు అడ్రెస్​ టైప్ చేయగానే అది దారి చూపిస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ రూట్ మ్యాప్ నే ఫాలో అవుతారు.   చాలా మంది  వాహనదారులు గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తెలియని ప్రదేశాలకు వెళ్తారు. అయితే ఒక్కోసారి గూగుల్ మ్యాప్ తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. అడ్డదిడ్డమైన రూట్లను చూపెడుతుంది. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.   లేటెస్ట్ గా సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని రాత్రిపూట  డ్రైవింగ్ చేసిన  ఓ లారీ  డ్రైవర్, క్లీనర్  సిద్దిపేట గౌరవెళ్లి  డ్యామ్ లో చిక్కుకున్నారు.

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ ,క్లీనర్  హుస్నాబాద్ వెళ్తూ రోడ్డు నేరుగా ఉందని  గూగుల్ మ్యాప్ లో చూపించడంతో  అలాగే వెళ్లారు.  కొద్ది దూరం  వెళ్లగానే క్యాబిన్ వరకు నీళ్లు చేరి లారీ ఆగిపోయింది. వెంటనే వాళ్లు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దగ్గర్లోని రామవరం గ్రామస్తులు లారీని తాళ్ల సాయంతో  భయటకు  తీశారు.