హైదరాబాద్, వెలుగు: టెలికం ఆపరేటర్ ఎయిర్‌టెల్, టెక్ కంపెనీ గూగుల్ చేతులు కలిపాయి. భారత్‌లో ఆర్‌సీఎస్ మెసేజింగ్ సేవలను అందించనున్నాయి. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, గూగుల్ ఆర్‌సీఎస్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి స్పామ్ మెసేజ్‌లు, డిజిటల్ మోసాలను అడ్డుకుంటుంది.
గత 1.5 ఏళ్ల నుంచి ఎయిర్‌టెల్ 7,100 కోట్ల స్పామ్ కాల్స్ 290 కోట్ల స్పామ్ మెసేజ్‌లను అడ్డుకుంది. దీనివల్ల నెట్‌వర్క్‌లో ఆర్థిక నష్టాలు 68.7 శాతం మేర తగ్గాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ మెసేజెస్ యాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆర్‌సీఎస్‌తో వాట్సాప్ తరహాలో హై-క్వాలిటీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను పంపొచ్చు.
