జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా జెమినీ 2.5 ప్రో

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా జెమినీ 2.5 ప్రో
  • 18 నెలల పాటు వాడుకోవచ్చు
  • దీని విలువ రూ.35,100

హైదరాబాద్​, వెలుగు: గూగుల్, రిలయన్స్ సంస్థలు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకాన్ని పెంచేందుకు చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా, రూ.35,100 విలువ గల గూగుల్ ​  జెమిని 2.5 ప్రో ప్లాన్​ను అర్హులైన జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నాయి. దీని ద్వారా యూజర్లకు జెమిని యాప్​లో 2టీబీ క్లౌడ్​స్టోరేజీ,   నానో బనానా, వియో 3.1 మోడల్స్​తో చిత్రాలు, వీడియోలు రూపొందించడం వంటి సదుపాయాలు ఉంటాయి. 

మొదటగా 18–-25 ఏళ్ల జియో 5జీ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. వ్యాపార సంస్థల కోసం, రిలయన్స్ ఇంటెలిజెన్స్​కు గూగుల్ క్లౌడ్ గో -టు- మార్కెట్ భాగస్వామిగా వ్యవహరిస్తూ, జెమిని ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్​ను భారత్‌‌‌‌‌‌‌‌కు తీసుకురానుంది.  రిలయన్స్ సంస్థ గూగుల్  క్లౌడ్​కు చెందిన టీపీయూలను కూడా వినియోగించుకోనుంది.