గూగుల్ డబ్బుల ఆదా...ఉద్యోగులకు ఉచితాల తొలగింపు

గూగుల్ డబ్బుల ఆదా...ఉద్యోగులకు ఉచితాల తొలగింపు

ప్రపంచ వ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధిస్తున్నాయి. తాజాగా గూగుల్ కంపెనీ కూడా తమ ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. ఇచ్చే ఫ్రీ సౌక‌ర్యాల‌ను తీసివేయ‌నుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులకు ఇచ్చే ఉచిత సౌకర్యాలను తొలగిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు ఓ నోటీసు అందినట్టు సమాచారం. 

ఉచితాల్లేవ్....

గూగుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తయారు చేసుకునేందుకు వీలుగా మైక్రో కిచెన్లు, ఉచిత లాండ్రీ సర్వీసులు, కంపెనీ స్వయంగా స్పాన్సర్ చేసే మధ్యాహ్న భోజనాలు వంటి అనేక సౌకర్యాలను ఉద్యోగులకు అందిస్తోంది. వీటిన్నింటికీ గూగుల్ త్వరలో ముగింపు పలకనుంది. ఈ ఉచితాలు వెచ్చించే నిధులను ఇతర ప్రాధాన్యాల వైపు మళ్లించడమే తమ లక్ష్యంగా గూగుల్ తన లేఖలో ఉద్యోగులకు స్పష్టం చేసింది. అంతేకాదు కొత్త నియామకాలను కూడా తగ్గించామని.. ప్రస్తుతమున్న ఉద్యోగులను  హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చింది. అయితే గూగుల్ కార్యాలయం ఏ ప్రాంతంలో ఉందనే దాన్ని బట్టి ఉచితాలకు కోతలు విధించనున్నారని సమాచారం.