
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా తనపై పోటీ చేసి గెలవాలన్నారు. దమ్ముంటే తేల్చుకుందాం రా...! అంటూ సవాలు విసిరారు. 'నా రాజీనామా కోసం మాట్లాడటానికి మీరెవరు? నేను రాజీనామా చేయను ఏం పీక్కుంటారో పీక్కోండి.' అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, తనను గోషామహల్ ప్రజలు గెలిపించారని అన్నారు. తాను పదవుల కోసం ఆశించే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ వేసిన రాష్ట్ర కమిటీతో పార్టీ అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టారు.
పార్టీని సర్వనాశనం చేస్తున్నదెవరో తర్వాత చెప్తానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రబ్బర్ స్టాంప్ గా మారొద్దని అన్నారు. స్టేట్ కమిటీలో 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి వారే ఉన్నారని అన్నారు. రూరల్ నుంచి కమిటీలో ఎంత మందికి అవకాశం ఇచ్చారో చెప్పాలని అన్నారు. రూరల్ అవసరం లేదా..? అని ప్రశ్నించారు. మీరేది అనుకుంటే అదే చేస్తారా..? అది రాంచందర్ రావు కమిటీనా..? కిషన్ రెడ్డి కమిటీనా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీతో తెలంగాణలో అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాయం చేస్తానని సవాలు విసిరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో తనకు మంచి సంబంధాలున్నాయని, తనకు అందరూ సపోర్ట్ చేస్తున్నారని, ఈ కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తుందా..? వారే చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్రకా ర్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తనను టార్గెట్ చేశారని అన్నారు.