హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 207 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 172 మార్కెట్ లకు కొత్త పాలకవర్గాల నియామకం పూర్త యింది. దీంతో 2,408 మంది కాంగ్రెస్ కార్య కర్తలకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. మిగిలిన 35 కమిటీల నియామకాలను త్వర గా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశా లు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సమయంలో 197 మార్కెట్ కమిటీలు ఉన్నా యి.
రైతుల సౌకర్యం కోసం మరో 10 కొత్త కమిటీలను ఏర్పాటు చేసి మొత్తం 207కి పెంచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరగడం ఇదే మొదటిసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీలను పట్టించుకోలేదని తుమ్మల విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతులు పంటలు అమ్ముకునే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తోందని తెలిపారు. పాలకవర్గాలతో మార్కెట్లలో పారదర్శకత పెరిగి రైతులకు సకాలంలో సౌకర్యాలు అందుతాయన్నారు. మిగిలిన 35 కమిటీల నియామకాలకు పీసీసీ నాయకులతో చర్చించి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
