తమిళనాడులో హిందీ బ్యాన్‎పై స్టాలిన్ సర్కార్ యూటర్న్

తమిళనాడులో హిందీ బ్యాన్‎పై స్టాలిన్ సర్కార్ యూటర్న్

న్యూఢిల్లీ: తమిళనాడులో హిందీ భాషను నిషేధిస్తూ తీసుకురావాలనుకున్న బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్రి భాషా సూత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించబోమని, ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉన్నామని డీఎంకే ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ క్రమంలోనే తమిళనాడులో హిందీ భాషపై నిషేధం విధించాలనుకుంది. 


రాష్ట్రమంతటా హిందీ హోర్డింగ్​లు, బోర్డులు, సినిమాలు, పాటలను బ్యాన్ చేయాలని బిల్లులో ప్రతిపాదించింది. రాజ్యాంగానికి లోబడే ప్రతిపాదిత చట్టాన్ని తీసుకురావాలనుకుంది. మంగళవారం దీనిపై చర్చించడానికి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. బుధవారం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకుంది. అయితే, వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం బిల్లును నిలిపేసింది.