పది నెలలుగా జీతాలు లేవు.. కుటుంబ పోషణ భారంగా ఉంది

పది నెలలుగా జీతాలు లేవు.. కుటుంబ పోషణ భారంగా ఉంది

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. గత పది నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 863 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నట్లు వారు పిటిషన్ లో తెలిపారు. పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని… తమ వేదనను అర్థం చేసుకొని తక్షణమే వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కమిషన్ ను కోరారు.