మొయినాబాద్ మున్సిపాలిటీలోని .. ఎన్కేపల్లి రైతులకు పట్టాలు అందజేత

మొయినాబాద్ మున్సిపాలిటీలోని .. ఎన్కేపల్లి రైతులకు పట్టాలు అందజేత

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్​ మున్సిపాలిటీలోని ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటుతో భూముల కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు అందజేస్తోంది. మంగళవారం 9 రైతు కుటుంబాలకు చెందిన 28 మంది కుటుంబ సభ్యులకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పట్టాలు పంపిణీ చేశారు. 

బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో చంద్రకళ మరో 7 రైతు కుటుంబాలకు చెందిన 18 మంది కుటుంబ సభ్యులకు పట్టాలను పంపిణీ చేశారు. మిగతా రైతులు కూడా పట్టాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఎకరానికి 300 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరుతుందన్నారు.