ఏసీబీ వలలో లేబర్ కమిషన్ ఆఫీసర్

V6 Velugu Posted on Jan 22, 2021

భద్రాద్రి కొత్తగూడెం : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జిల్లా కేంద్రంలోని లేబర్ కమిషన్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి కొంత మొత్తాన్ని డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు బాధితుడు ఇస్తున్న డబ్బు రబ్బానీ తీసుకుంటుండగా  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

 

Tagged acb, bribe case, Bhadradri Kothagudem District

Latest Videos

Subscribe Now

More News