సహాయ చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్: మల్లు రవి

సహాయ చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్: మల్లు రవి

వరదలతో ప్రజలు అల్లాడుతున్నరు: మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలతో సిటీల్లోని ప్రజలు అల్లాడుతున్నా.. సహాయ చర్యలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి విమర్శించారు. కనీసం పునరావాస కేంద్రాలనూ ఏర్పాటు చేయడం లేదన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఇండ్లలోకి వరద నీళ్లతోపాటు పాములు వస్తున్నాయని, వరద నీరు వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. వరదల వల్ల ప్రజలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. 

సెక్రటేరియెట్, ప్రగతిభవన్ వంటి బిల్డింగ్​లు నిర్మించినంత మాత్రాన అది బంగారు తెలంగాణ కాలేదన్నారు. గతంలో హైదరాబాద్​లో వరదలు వచ్చినప్పుడు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారని, ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయడం లేదని ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్​ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లడ్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.