వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
  • కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌‌ పద్ధతిలో నియమించేందుకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: వైద్య ఆరోగ్య శాఖలో 3,977 పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,391 పోస్టులు (881 కాంట్రాక్టు, 510 ఔట్ సోర్సింగ్), పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ పరిధిలో 476 పోస్టులు (264 కాంట్రాక్టు, 212 ఔట్ సోర్సింగ్) మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌ పరిధిలో 894 పోస్టులు (613 కాంట్రాక్టు, 281 ఔట్ సోర్సింగ్), వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,216 ఏఎన్ఎం, ఎంపీహెచ్‌‌ఏ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నియామకాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టాలని సూచించారు. అయితే ఈ పోస్టులన్నీ 2022 మార్చి 31 వరకు, లేదా ప్రస్తుత అవసరాలు తీరే వరకు చెల్లుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.