పాన్ ఆధార్ లింక్ లేట్ చేసిన వారి నుంచి​ రూ.600 కోట్లుఫైన్

పాన్ ఆధార్ లింక్ లేట్ చేసిన వారి నుంచి​ రూ.600 కోట్లుఫైన్

న్యూఢిల్లీ: పాన్.. ఆధార్ లింక్ ఆలస్యం చేసిన వారి నుంచి లేట్​ పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.600 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే 11.48 కోట్ల పాన్‌‌‌‌లు ఇంకా ఆధార్​తో లింక్ కాలేదని తెలిపింది. సోమవారం లోక్​సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.

2024 జనవరి 29 నాటికి అందుబాటులో ఉన్న లెక్కలు ఇవని తెలిపారు. పాన్, ఆధార్ ​ఫ్రీ లింక్​కు 2023 జూన్ 30 చివరి తేదీ. ఆ తర్వాత నుంచి పాన్, ఆధార్‌‌‌‌ను లింక్ చేసుకోవాలంటే ప్రభుత్వం రూ. వెయ్యి పెనాల్టీ విధిస్తోంది.