హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద సంపుల నిర్మాణం

హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద సంపుల నిర్మాణం
  • 140 ప్రాంతాల్లో నిర్మాణానికి సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని 140 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద సంపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్​సర్కిళ్ల పరిధిలో రూ.20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్​ప్రిన్సిపల్​సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం వాటర్​లాగింగ్​ఏరియాల్లో పర్యటించారు. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ వద్ద అధికారులతో సమావేశమయ్యారు.

వీటితోపాటు సంపుల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆయన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదే విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, కేసీపీ జంక్షన్  మెర్క్యూర్ హోటల్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, ద్వారక హోటల్, లక్కీ హోటల్, ఖైరతాబాద్ రైల్వే గేట్, ఖైరతాబాద్ పెట్రోల్ పంపు, జోయాలుక్కాస్, అమీర్ పేట్ ఇమేజ్ హాస్పిటల్ వద్ద సంపులు నిర్మించనున్నారు.