నైనీ బ్లాక్‌లో సింగరేణికి అటవీ అనుమతులు.. ​ క్లియెరెన్స్​ ఇచ్చిన ఒడిశా సర్కారు

నైనీ బ్లాక్‌లో సింగరేణికి అటవీ అనుమతులు.. ​ క్లియెరెన్స్​ ఇచ్చిన ఒడిశా సర్కారు

హైదరాబాద్, వెలుగు: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బ్లాక్‌కు ఆ ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేసింది.  సింగరేణికి 2015లో ఒడిశాలోని అంగూల్​ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు సింగరేణి ప్రణాళికలు చేసుకున్నది. అయితే, వివిధ కారణాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి సాధ్యంకాలేదు. 2022 స్టేజ్​ 2 అనుమతులు రాకుండా డిలే అయింది.  తాజాగా, 643 ఎకరాల అటవీ భూములు ఇవ్వడానికి  ఒడిశా ప్రభుత్వం నైనీబ్లాక్​కు  ఫారెస్ట్​ క్లియెరెన్స్​ఇచ్చింది.  అటవీ అనుమతుల నిర్ణయంతో సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు అన్నీ తొలగిపోయి మార్గం సుగమమైంది.

ఒడిశా సీఎంకు కిషన్​రెడ్డి కృతజ్ఞతలు

ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు  శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2015లోనే సింగరేణికి ఈ నైనీ బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదని పేర్కొన్నారు.  సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాక  తెలంగాణలో పవర్​ సెక్యూరిటీకి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. అనుమతుల కోసం వేగవంతంగా నిర్ణయం తీసుకున్నారని ఒడిశా సీఎం మోహన్​ చరణ్​మాంఝీకి కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.