దివ్యాంగులకు రూ.4వేల పెన్షన్

దివ్యాంగులకు రూ.4వేల పెన్షన్

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు ఇక నుంచి 4,016 పెన్షన్ ను అందుకోనున్నారు. ఈ నెల నుంచి పెన్షన్​ పెంపు అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

 దీని ప్రకారం 5 లక్షల పైగా దివ్యాంగ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.  పెన్షన్​ పెంపునకు సంబంధించిన జీవోను ఆర్థిక మంత్రి హరీశ్​రావు ట్వీట్​ చేశారు.  పెంచిన పెన్షన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు రూ.205.48 కోట్లు అందుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు.