నిరుద్యోగ యువతపై ప్రభుత్వం కుట్ర

నిరుద్యోగ యువతపై ప్రభుత్వం కుట్ర

TSPSC  చేసిన తప్పులకు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో స్టాప్ నర్స్ ఉద్యోగులకు సెలక్ట్ అయిన అభ్యర్థులతో మాట్లాడారు.

2017, నవంబర్ లో 3311 స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. 21,319 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు దాసోజు శ్రవణ్. అయితే.. 2418 మందికి అపాయింట్ మెంట్ ఇచ్చి.. మిగతా 893 మందికి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వారిని మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.  వెంటనే వారికి ఉద్యోగాలు కల్పించాలని కొత్తగా వచ్చిన TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. 

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు దాసోజు శ్రవణ్. ఉద్యోగాలు రాక..50మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఏడాదిన్నరగా TSPSC చైర్మన్ పదవి ఖాళీగా ఉందని.. ఈ మధ్యనే కొత్తగా TSPSC కమిటీ ఏర్పాటైందన్నారు. జనార్థన్ రెడ్డి హయాంలోనైన సక్రమంగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 4.90 వేల ఉద్యోగాలు ఉండాలి...నీ 30,40 శాతమే ఉద్యోగులు వున్నారని తెలిపారు.నిరుద్యోగ యువత పట్ల  ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.34 ఏళ్లు దాటొద్దు అని.. వ్యవసాయ నోటిఫికేషన్ లో వేశారు. దీన్నే అన్ని నోటిఫికేషన్ లకు అమలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 44 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయక 10 ఏళ్లు దాటిందన్న దాసోజు..నోటిఫికేషన్ లకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.