
- రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించి, విక్రయాలకు సన్నాహాలు
- ఈ సీజన్‌లో 8 లక్షల బాటిళ్ల అమ్మకాలకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిక్విడ్ నానో యూరియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతు వేదికల ద్వారా ఈ నానో యూరియా అమ్మకాలు చేసేందుకు వ్యవ సాయ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. నానో యూరియాను ప్రోత్సహించాలని ఇప్పటికే కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, ఇండియన్ ఫార్మర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) జులై నెలకు సంబంధించి రాష్ట్రానికి 85 వేల నానో యూరియా బాటిల్స్ ఈ వానాకాలం సీజన్ కో సం కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల ద్వారా నానో యూరియాపై రైతు ల్లో అవగాహన కల్పించి, వాటి అమ్మకాలు పెంచ డమే లక్ష్యంగా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చే సేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 8 లక్షల బాటిళ్ల నానో యూరియా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ధర తక్కువ, దిగుబడి ఎక్కువ..
రైతులు వినియోగిస్తున్న యూరియాతో భూమికి హాని జరగడంతో పాటు భూసారం కూడా తగ్గు తోందని అధికారులు అంటున్నారు. సాధారణ యూరియా వాడకాన్ని తగ్గిస్తూ, భూసారాన్ని దెబ్బతీయకుండా నానో యూరియా రూపుదిద్దుకుంది. అర లీటర్ నానో యూరియా.. 45 కేజీల సాధారణ యూరియాతో సమానమని పేర్కొన్నారు. సాలిడ్ రూపంలోని యూరియా గులికల కంటే కూడా నానో లిక్విడ్ యూరియాతో లాభాలు ఎక్కువ ఉన్నాయని సైంటిస్ట్‌లు చెబుతు న్నారు. నానో యూరియాను సాధారణ ఎరువుల షాపుల్లో అమ్మితే రైతుల నుంచి స్పందన రావడం లేదని, అందకే రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించి, అక్కడే వాటి విక్రయాలు జరపాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.