
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ..ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొనసాగిస్తూనే…EWS వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 50శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా…ఇప్పుడు ప్రకటించిన పదిశాతం అదనంగా ఉండనున్నాన్నాయి. దీంతో విద్యా, ఉద్యోగాల్లో మొత్తంగా 60శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. ఆర్థికంగా వెనకబడిన తరగతులను ఆదుకునేందుకు కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు జరుగుతోంది.
SEE MORE NEWS