కరోనా రూల్స్ పాటించలేదని రూ.50 వేల ఫైన్

కరోనా రూల్స్ పాటించలేదని రూ.50 వేల ఫైన్

సింగపూర్: ప్రపంచాన్ని ఇంకా కరోనా భయం వీడలేదు. వ్యాక్సినేషన్ జరుగుతున్నా డెల్టా, డెల్టా ప్లస్ అంటూ కొత్త వేరియంట్‌లు రావడం అందర్నీ భయపెడతోంది. అందుకే కొవిడ్ రూల్స్ విషయంలో చాలా దేశాలు సీరియస్‌గా వ్యవహరిస్తున్నాయి. మాస్కులు పెట్టుకోపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. సింగపూర్‌లో జరిగిన ఓ ఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడిన కారణంతో ఓ వ్యక్తికి సింగపూర్ ప్రభుత్వం వెయ్యి డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ.50 వేలు) ఫైన్ వేసింది. జరిమానా కట్టాల్సిందిగా నిబంధనలను అతిక్రమించిన వ్యక్తికి సింగపూర్ ప్రభుత్వం పంపిన నోట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని బట్టి కరోనూ రూల్స్ అమలు విషయంలో సింగపూర్ ఎంత సీరియస్‌గా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ తెల్లవారుజామున 3 గంటలకు కూడా పోలీసింగ్ చేస్తుండటం గమనార్హం.