ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్షిప్ సీట్లు పెంపు.. వంద నుంచి 200కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్షిప్ సీట్లు పెంపు.. వంద నుంచి 200కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్​షిప్ సీట్లను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఎస్టీ సంక్షేమ శాఖలో ఏడాదికి 100 మందికి ఓవర్సీస్ స్కాలర్​షిప్ ఇస్తుండగా ఈ సంఖ్యను 200కి పెంచుతూ ఎస్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ సబ్య సాచి ఘోష్ జీవో 22 ను గురువారం (సెప్టెంబర్ 18) రిలీజ్ చేశారు. 

వాస్తవానికి ఈ సంఖ్యను 250కి పెంచాలని గత ఏడాది ప్రభుత్వానికి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం దానిని 200కి పరిమితం చేస్తూ జీవో ఇచ్చింది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ప్రతి ఏటా రెండు సార్లు రూ. 10లక్షల చొప్పున రూ.20 లక్షలను పేద ఎస్టీ విద్యార్ధులకు ప్రభుత్వం అందచేస్తోంది.