కాల్పులు విరమించి చర్చలు జరపాలి ..పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్

కాల్పులు విరమించి చర్చలు జరపాలి ..పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై పౌర సమాజం స్పందించాలన్నారు. లేకుంటే భవిష్యత్ లో రాజ్యాంగం విధ్వంసమయ్యే ప్రమాదముందన్నారు. కాల్పుల విరమణ విషయంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు నాగయ్య, ఏకే ప్రభాకార్, చరణ్ పాల్గొన్నారు.