
హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై ప్రకటించగా.. అదే సమయానికి తాము కూడా తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. గవర్నర్ ప్రోగ్రామ్‌కు పోటీగా ప్రభుత్వం ప్రోగ్రామ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. తాజ్‌కృష్ణ హోటల్లో జరిగే వేడుకలకు మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు హాజరు అవుతారని ప్రభుత్వం తెలిపింది. కిందటేడాది రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసారి కూడా రాజ్‌భవన్ నుంచి అందరికీ ఆహ్వానాలు పంపించినట్టు తెలిసింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరవకుండా ఉండేందుకే, గవర్నర్ పెట్టిన సమయానికే ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని తలపెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. రాజ్‌భవన్‌లో కార్యక్రమానికి హాజరు కావాలని పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు గవర్నర్ ఆహ్వానం పంపారు. ప్రభుత్వం కూడా తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని వారికి కబురు పెట్టింది. రెండు కార్యక్రమాలు ఒకేసారి ఉండడం, పోటాపోటీగా ఆహ్వానాలు పంపండంతో ఎవరు ఎటు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ కంటే, ప్రభుత్వమే పవర్ ఫుల్ అనిపించుకునేందుకు మహిళా దినోత్సవ వేడుకలను కూడా ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.