స్కూళ్లలో సౌలతులు కల్పిస్తున్నాం..కార్పొరేట్  స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తాం

స్కూళ్లలో సౌలతులు కల్పిస్తున్నాం..కార్పొరేట్  స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తాం

కోదాడ, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్లకు అన్ని సౌలతులు కల్పించి,  కార్పొరేట్  స్కూళ్లకు దీటుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని కాపుగల్లు హైస్కూల్ లో సైన్స్ లాబ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సైన్స్  ల్యాబ్​లు, డిజిటల్  క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.