హుస్నాబాద్, వెలుగు: గ్రామాల రూపురేఖలు మారాలంటే సర్పంచులు యాక్టివ్ కావాలని, ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ఊర్లలోకి రాకుండా చూసి, సర్కారు బడుల్లో స్టూడెంట్స్ సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హుస్నాబాద్ వైశ్య భవన్లో నిర్వహించిన ఎడ్యుకేషన్ వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, పథకాలు కావాలి కానీ.. చదువు, వైద్యం మాత్రం సర్కారుది వద్దనే తీరు మారాలని సూచించారు.
కట్ట వెడల్పు పనులు పూర్తి చేసి, దశల వారీగా సీసీ రోడ్లు వేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు హుస్నాబాద్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మంత్రి సమక్షంలో జరిగింది. జనరల్ కేటగిరీలో పున్న లావణ్య, భూక్యా సరోజన.. మైనార్టీ విభాగం నుంచి మహమ్మద్ హసన్ లాల్ ఎన్నికయ్యారు. వీరితో కమిషనర్ మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేయించగా, మంత్రి వారిని సన్మానించారు.
