అర్చకులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు

అర్చకులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు
  • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణాచారి

కాచిగూడ, వెలుగు:అర్చకులను వేధించే అధికారులపై చర్యలు తప్పవనిరాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణాచారి హెచ్చరిం చారు. బుధవారం బర్కత్ పురాలోని అర్చకసంక్షేమ భవన్ లో తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ దీప ధూప నైవేద్య అర్చక సమాఖ్య సంయుక్త ఆధ్వర్యం లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగాహాజరైన  కెవి.రమణాచారి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 2625 మంది అర్చక ఉద్యోగులకు 557 జీవో ప్రకారం వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం లోని దేవాలయాల్లో పనిచేస్తున్న 5625 మందిఅర్చక ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో జారీచేసిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు 3000 మందికిమాత్రమే జీతాలు నేరుగా అందుతున్నా యని, మిగతావారికి దసరా తరువాత దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధి కారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరికి వేతనాలుఅందే విధంగా చర్యలు తీసుకుం టామని ఆయన హామీఇచ్చారు .

అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.36కోట్లు కేటాయిం చిందని, వీటిని సద్వినియోగం చేసుకోవా-లని ఆయన అర్చకులను కోరారు. వేద పండితుల నియా-మకాలకు నోటిఫికేషన్ విడుదలైం దని ఈ నెలాఖరు వరకుదరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బ్రాహ్మణసంక్షేమ పరిషత్ ద్వా రా రాష్ట్రం లోని ఏడు వందల బ్రాహ్మణకుటుంబా లకు 3 లక్షల చొప్పున సబ్సిడీ ఇచ్చామని, విదే-శాలకు వెళ్లిన 200 మంది విద్యార్థు లకు రూ.20 లక్షలఫీజు రీయిం బర్స్​మెంట్ అందజేశామన్నా రు. దీప ధూపనైవేద్యం కిం ద అర్చకులకు రూ.ఆరువేల వేతనం ఇవ్వా-లని మొదట నిర్ణయిం చామని, దానిని 10 వేలకు పెంచేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయనహామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకుల డిమాం డ్లపై తీర్మానాన్ని అర్చకులు రమణాచారికి అందజేశారు. ఈసమావేశంలో తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్ గంగు ఉపేం ద్ర శర్మ, ప్రధాన కార్యదర్శి నల్ల న్ వేణుగోపాల్, వీరభద్ర శర్మ , మోహన్ శర్మ తదితరులు పాల్గొ న్నా రు.