ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‎లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించకుంటే 2025, మే 7 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల బాటలోనే.. సింగరేణి కార్మికులు కూడా ఈ నెల  చివర్లో సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాలు వరుసగా సమ్మెలకు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఈ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్‎ అధికారుల కూడిన కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్‎తో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందిజేయనుంది. వీలైనంత తొందరగా ప్రభుత్వ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.