న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కింపులో కచ్చితత్వాన్ని పెంచేందుకు కేంద్రం ఈ–-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ధరల డేటా సేకరించనుంది. దీనికోసం సీపీఐ బేస్ ఇయర్‌ను 2024కు మారుస్తూ కొత్త సిరీస్‌ను 2026 ఫిబ్రవరి 12న విడుదల చేయనుంది.
జీడీపీ ఐఐపీ బేస్ ఇయర్‌ను 2022-–23కు మార్చనుంది. 25 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 12 నగరాల నుంచి ఈ-–కామర్స్ ధరలను తీసుకుంటారు. రైల్వే ఛార్జీలు, ఇంధన ధరలు, పోస్టల్ టారిఫ్‌ల కోసం ఆయా శాఖల డేటా వాడుతారు.
జీఎస్టీఎన్ ఫైలింగ్స్ ద్వారా జీడీపీ వృద్ధిని అంచనా వేస్తారు. సేవారంగం కోసం 2026 నుంచి ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నారు.
