ఏపీలో ఒకే రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్

V6 Velugu Posted on Jun 20, 2021

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 8 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు, మిగిలిన వాటిలో ఒక్కో జిల్లాల్లో 50వేలకు పైగా డోసులు సిద్ధంగా ఉంచారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులు రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది ఉన్నారు. వీరిలో నిన్నటి వరకు 28% మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన వారిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్  వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటివరకూ ఏపీలో కోటి 22 లక్షల 83 వేల 479 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 

Tagged AP government, Andhra Pradesh, corona vaccine, announce, 8 lakh people

Latest Videos

Subscribe Now

More News