రైతులకు ఇబ్బంది కలిగించవద్దు.. కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలి

రైతులకు ఇబ్బంది కలిగించవద్దు.. కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలి

నకిరేకల్, వెలుగు: నియోజకవర్గంలోని రైతులను ఇబ్బంది కలిగించవద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్  ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశించారు. సోమవారం తహసీల్దార్  ఆఫీస్​లో అధికారులతో రివ్యూ చేశారు. నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సూచించారు.