బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నరు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నరు:   ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం లేదని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ బండ గణేశ్‌‌‌‌‌‌‌‌, నూనె నగేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ పాలనకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత జరిగిన సర్పంచ్, మున్సిపల్, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఆశీర్వదించారన్నారు. వ్యవసాయనికి  3 గంటల విద్యుత్ సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం,  మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ నరసయ్యయాదవ్, సర్పంచ్​శ్రీకాంత్ పాల్గొన్నారు.