హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్ అన్నారు. మొత్తం 64 సమస్యల్లో 30 సమస్యలను ఇప్పిటికే పరిష్కారించిందని తెలిపారు. శుక్రవారం మైసిగండిలోని ఓ రిసార్ట్‌లో టీజీవో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు,76 శాఖల ఫోరంల నేతలు పాల్గొన్నారు. ఏలూరు శ్రీనివాసరావు, శ్యామ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల బ్యాంకులతో ఎంవోయూ చేసుకుని ఉద్యోగులకు కల్పిస్తున్న బీమా వల్ల 14 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు లబ్ధి కలగనుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, సీఎస్‌లకు టీజీవో రాష్ర్ట కార్యవర్గం తరుఫున ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిలో సైతం బీమా స్టార్ట్ చేసి 45 మందికి ఇటీవల కోటి పరిహారం అందజేశారని నేతలు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో 25వ జీతాలు తేదీ వరకు పడేవని, ఇపుడు ఫస్ట్‌న పడుతున్నాయని గుర్తు చేశారు.
