ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు GHMC లో విలీనానికి గవర్నర్ ఆమోదం

ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు GHMC లో విలీనానికి గవర్నర్ ఆమోదం

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ లో (GHMC) విలీనానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే ప్రభుత్వం గెజిట్ జారీ చేయనుంది. 

20 మున్సిపాలిటీలు,7  కార్పోరేషన్లను GHMC లో విలీనానికి ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్.. గవర్నర్ కు పంపింది. సోమవారం (డిసెంబర్ 01) GHMC, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ల సవరణ  ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో GHMC లో కొత్త మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు చేరనున్నాయి. 

►ALSO READ | రామగుండం ఎయిర్ పోర్టుకు సహకరించాలె:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గ్రేటర్ హైదరాబాద్‌‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌‌‌‌ఆర్) లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించడంతో విలీనానికి మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది ప్రభుత్వం.

GHMCలో విలీనం కాబోయే కొత్త మున్సిపాలిటీలు ఇవే :

1. పెద్ద అంబర్ పేట
2. జల్ పల్లి
3. శంషాబాద్
4. తుర్కయాంజిల్
5. మణికొండ
6. నార్సింగ్
7. ఆదిభట్ల
8. తుక్కుగూడ
9. మేడ్చల్
10. దమ్మాయిగూడ
11. నాగారం
12. పోచారం
13. ఘట్కకేసర్
14. గుండ్ల పోచంపల్లి
15. తూముకుంట
16. కొంపల్లి
17. దుండిగల్
18. బొల్లారం
19. తెల్లాపూర్
20. అమీన్ పూర్
21. బడంగపేట్
22. బండ్లగూడ జాగీర్
23. మీర్ పేట
24. బోడుప్పల్
25. పీర్జాదీగూడ
26. జవహర్ నగర్
27. నిజాంపేట